తెలుగు రాష్ట్రాల నుండి జేఈఈ మెయిన్స్‌కు సుమారు 1.50 లక్షలు! 26 d ago
జేఈఈ మెయిన్స్ కి గడువు తేదీ ఈ నెల 22వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే పేపర్-1(బీటెక్ సీట్లకు) 12.21 లక్షలు, పేపర్-2 కు (బీఆర్క్, బీప్లానింగ్ సీట్లు) 74 వేల దరఖాస్తులు, మొత్తంగా 12. 95 లక్షల మంది దరఖాస్తు చేశారు. జాతీయ పరీక్ష నిర్వహణ సంస్ధ(ఎన్‌టీఏ) విధించిన నిబంధనల కారణంగా ఈ సారి తొలుత దరఖాస్తుల సంఖ్య నెమ్మదించినప్పటికీ గతేడాదితో పోల్చితే తగ్గుదల స్వల్పంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. జాతీయ పరీక్ష నిర్వహణ సంస్ధ ఏపీలో గతేడాది 29 చోట్ల పరీక్షలు జరపగా, ఈ సారి విద్యార్ధుల నుండి డిమాండ్ లేకపోవడంతో 22 పట్టణాలు/నగరాలను మాత్రమే పరీక్షా కేంద్రాలుగా పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి జేఈఈ మెయిన్స్‌కు దాదాపుగా 1.50 లక్షల మంది పోటీపడనున్నారు.